Top Menu

ఆనందం అంటే సుఖమా...? మీకు తెలుసా ?


 • "ఆనందం" & "సుఖం" వేరు వేరని ?
  మీరు చాలా ఉన్నతిలొ ఉన్నా, అన్ని సదుపాయాలు ఉన్నా, ఏది కావాలంటే అది చేయగలిగినా, ఏది కొరుకుంటే అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందంగా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందంగా ఉన్నామని చెపుతున్నారు.

  ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా ? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?... ఆలోచించండి.

  ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కోసం ఆనందాన్ని వదిలేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం.
 • ఆనందం అంటే ఏమిటి ?
  అనందం అనేది వస్తువు కాదు. ఒక అనుభూతి మాత్రమే...
 • ఆనందం ఎందులో ఉంటుంది ?
  కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందా......కాదనే చెప్పాలి. పెద్ద ఇల్లు, కీర్తి, చుట్టాలు, స్నేహితులు ఉంటే వస్తుందా.......కాదనే చెప్పాలి.
  • 25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు.
  • 40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు.
  • 25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు.
  • 10 % మంది కళలు, దేవుడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నారు.

   మరి మీ ద్రుస్ఠిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...
 • మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారో లెక్కపెట్టగలరా ?
  ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అద్రుస్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ... ఎందుకు ఆనందాన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగా జీవించామన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిమిషాన్నీ ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలోనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి.
 • ఆనందం లో శాతాలు(%) ఉన్నాయని మీకు తెలుసా ?
  ఆనందంగా ఉన్నారా.. ఉంటే ఎంత % ఆనందంగా ఉన్నారు.. ఏం చేస్తే మీ ఆనందం 100 % అవుతుంది...
 • ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా ?
  ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి.

  రేపటి తరం ఆనందం గా ఉందా (ఉంటుందా) ?

  పోటీ చదువులు, కంప్యూటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందాన్ని దూరం చేస్తున్నాయి.

  ఈ కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచేసే ఆఫీసులు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేవుడితో బిజినెస్ చేసే మనుషులు....... ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయా ?

  ఇక్కడ మీకొక విషయం చెప్పాలి.

  దైవత్వం, మానవత్వం, పశుతత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి.
  ఏది ఎంత % మీలో ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

  గమనిక: నాకు ఆనందం అంటే ఏదో తెలుసని ఈ పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైనా తెలియని వాళ్లు ఉంటే వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారెమో అని.

1 comment :

 1. Wynn Slots for Android and iOS - Wooricasinos
  A free 메이피로출장마사지 app for slot machines https://septcasino.com/review/merit-casino/ from https://sol.edu.kg/ WRI Holdings Limited that lets you play the 1xbet app popular games, such as free video slots, table games wooricasinos.info and live casino

  ReplyDelete

Copyright © తాజా వార్త.
Designed by OddThemes &