70 ఏళ్లలో చేయలేనిది., 3 ఏళ్లలో చేశారు రాజుగారు... తోపండీ మీరు..

ప్రధాన మంత్రుల వల్లకానిది…ప్రభుత్వాలు చేయలేనిదీ ఒక్క అశోక్ గజపతి చేసి చూపించారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు…కేంద్రం సర్టిపై చేస్తోంది. కేబినెట్ లో ర్యాంకులిస్తే… రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఆయనే ది బెస్ట్ అంటున్నారు. అటు కేంద్రంలోనే కాదు ఇటు టీడీపీలోనూ ఢిల్లీ రేంజ్ రికార్డ్ ఆయనదేనట ! ఇంతకీ సంగతి ఏంటో తెలుసా ? ఆశ్చర్యపోయే పనితీరు ఇది !

దటీజ్ ఆశోక్ గజపతి ! బహుశా పని తప్ప…అప్పగించిన బాధ్యత తప్ప మరో ధ్యాస లేకపోతే ఫలితాలు ఉంటాయో అశోక్ గజపతి రాజు చేతల్లో చూపిస్తున్నారు. అందుకే ఒకటి కాదు రెండు కాదు 70 ఏళ్లుగా సాధ్యంకానిది ఆయన చేసి చూపారు. రికార్డ్ బ్రేక్ చేశారు. ఈ లెక్కన చూస్తే అశోక్ గజపతి దేశంలోనే ది బెస్ట్. ఎలాగో చూద్దాం ! స్వతంత్ర్యం వచ్చాక దేశంలో 70 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయట. మొత్తం పర్మిషన్లు, నిర్మాణాలు అయ్యి…విమానాలు దిగేందుకు వీలుగా సిద్ధమైన ఏర్ పోర్టులు ఇవి. కానీ అశోక్ గజపతి రాజు బాధ్యతలు అందుకున్నాక కొత్తగా 80 విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. అంతకు ముందు వరకూ ఉన్న పద్ధతి వేరు. ఈయన కేవలం అనుమతులు ఇచ్చి ఊరుకోలేదు. క్లియరెన్సులు దగ్గర ఉండి చూసి… అక్కడ ఏర్పాట్లు, స్టాండర్డ్స్ అన్నీ పరిశీలించి, సౌకర్యాలు పద్ధతిగా సాగి…విమానం గాల్లోకి ఎగిరే వరకూ నాదే బాధ్యత అన్నట్టు తీసుకున్నారు. అందుకే ఇంతలా చెప్పుకోవడం. ఇప్పటి వరకూ అయ్యింది ఓ లెక్క…గజపతి చేసింది ఓ లెక్క అని కేంద్రం ప్రత్యేకంగా చెబుతోంది ఇప్పుడు.

ఇక టీడీపీ సంగతిచూద్దాం. టీడీపీ తరపున ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఎక్కువ కాలం కొనసాగింది కూడా అశోక్ గజపతే! అంతకు ముందు ఎర్రన్నాయుడు, ఉమ్మారెడ్డి లాంటి వాళ్లు మంత్రులుగా ఉన్నా వాళ్లెవరూ రెండేళ్లకి మించి లేరు. గజపతి రాజు మాత్రం మూడున్నరేళ్లుగా ఉన్నారు. అదే హుందాతనం, తిరుగులేని పనితీరు. అందుకే టీడీపీ తరపున ఎక్కువ కాలం పనిచేసిన మంత్రిగా కూడా రాజుగారు రికార్డు సృష్టించారు. ఇంతకీ ఈ సంగతి మీకు తెలుసా సార్ అంటే… ఐ డోన్ట్ నో యార్, లెట్ ఇట్ బి… వి హావ్ టు వర్క్ హార్డ్, దటీజ్ వాట్ ఐ డిడ్ అని సింపుల్ గా తనదైన స్టైల్లో చెప్పేశారు. అందుకే గజపతి రాజు గురించి ఎప్పుడు చెప్పినా కొత్త సంగతులు బైటపడతాయ్ అనేది !

Post a Comment

Copyright © తాజా వార్త.
Designed by OddThemes &