Top Menu

ఆంధ్రప్రదేశ్ తరుపున మోడీకి ఒకసామాన్యుడి సూటి ప్రశ్నలు.


ఓ ఆంధ్రప్రదేశ్‌ అభిమాని ఎవరో సోషల్‌ మీడియాలో ప్రధాని నరేంద్రమోడీకి కొన్ని ప్రశ్నలు సంధించిన పోస్టు ఒకటి బాగా వైరల్‌గా మారింది. దాదాపు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అందరిలో అవే ప్రశ్నలు నానుతున్నాయి. వారి మనసులో ఉన్న అభిప్రాయాలు, అనుమానాలనే ఒకరు గుదిగుచ్చి రాశారు. దాంతో ఏపీలో ఆ పోస్టు బాగా షేర్‌ అవుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు వేలమంది ముందు వాగ్దానం చేసిన విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు…??

హుద్ హుద్ బీభత్సానికి అతలాకుతలం అయిన ఉత్తరాంధ్రకి మీరు చేసింది ఏమిటి?...

అందులో ఏవేం నెరవేర్చారు? మీరు ప్రకటించిన రూ.1000 కోట్లు ఎంతవరకు ఇచ్చారు??

కోస్తా కారిడార్, సాగర్ మాల ఎంతవరకు అమలు అయింది? మీ ఆధ్వర్యంలోని రైల్వేశాఖ తుని రైల్ దహనం, రైల్వే పోలీస్ స్టేషన్ ధ్వంసం కేసు ఎందుకు పక్కన పెట్టారు..??

పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి చేస్తామని చెప్పి ఇవ్వాళ ఎందుకని ఆటంకాలు సృష్టిస్తున్నారు. .??

నోట్ల రద్దుతో దేశ ప్రజల జీవితాల్ని ఛిద్రం చెయ్యటం వాస్తవం కాదా..??

GST ప్రవేశపెట్టి సామాన్య ప్రజలు కనీసం హోటల్ కి వెళ్లి కాఫీ తాగలేని పరిస్థితి కల్పించటం వాస్తవం కాదా..??

ఒక పరిశ్రమకి వ్యాపారి మెటిరియల్ సప్లయ్ చెస్తే 4 నెలల వరకు తిరిగి పేమెంట్ వచ్చే పరిస్థితి లేదు.. మీ GST వల్ల డెలివరీ రొజునే బిల్ చేసి 4 నెలల వరకు రాని డబ్బులకు ముందే GST కట్టాలి అనే నిబందన వల్ల పారిశ్రామిక రంగం కుదేలు అవటం వాస్తవం కాదా..??

మీరు వాగ్దానం చెసిన స్విస్ నల్లదనం ఏమైంది మోడీజీ..??

మీరు ప్రమాణస్వీకారం చేసే రోజుకి పెట్రోల్ , డీజిల్ కొనుగోలు అమ్మకం రేట్లు ఎంత, ఈవాళ రేట్లు ఎంత..??

వంట గ్యాస్ ఆ రోజు రేటు ఎంత.. ఈరోజు రేటు ఎంత ..??

నిత్యావసరాల ధరలు ఆరోజు ఎంత, ఈ రోజు ఎంత సార్..??

వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు రూ.16000 కోట్లు ఎందుకు ఇవ్వరు..??

నూతన రాజదాని అమరావతికి ఆర్దిక సహాయం ఎందుకు చేయరు సార్ ..??

తిరుపతి వేంకటేశుని సాక్షిగా మీరు ప్రకటించిన వాగ్దానాలు ఏమయ్యాయి??

ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తాన్నారు మరిచారా??

మీరు ప్రమాణస్వీకారం చేయక ముందు దేశంలో ఉన్న ఆర్దిక తీవ్రవాదులు అందరూ జైలులో ఉన్నారు.. ఇవ్వాళ దేశాన్ని దోచుకున్న దొంగలు అందరూ నిసిగ్గుగా బహిరంగంగా తిరగట్లేదా??

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మౌనంగా పని చేసుకుంటూ సమాచారహక్కు చట్టం, ఉపాధిహామీ లాంటి పనులతో ప్రజలకి మంచి చేసారు. అమరావతిలో ప్రైవేట్ యూనివర్సిటీలు VIT, SRM లు ఒక సంవత్సరంలో పూర్తి చేసారు.. మీరు ప్రకటించిన కేంద్ర విశ్వ విద్యాలయాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి..??

నవ్యాంధ్ర నుండి వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేయట్లేదా??

తిరుపతి వేంకటేశుని ముందు అబద్దాలు చెప్పిన వారు, ఆంధ్రులకి ద్రోహం చేసిన వారు బాగుపడినట్టు చరిత్రలో లేదు. రాజకీయ లభ్ది కోసం దొంగలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు సార్.

సోషల్ మీడియా సౌజన్యంతో...!!!

Post a Comment

Copyright © తాజా వార్త.
Designed by OddThemes &