లిటిల్ ఫింగర్ - ఈ వీడియో లో ఆడపిల్లల కష్టాలు చూస్తే మన తల్లి, చెల్లి గుర్తుకొస్తారు.." కుక్కలకి, పందులకి,అచ్చోసిన ఆంబోతులకి, మగవాళ్ళకి ఉన్న సౌకర్యం ఆడపిల్లలకు లేదు.."

ఈ మాటంటే చాలా మంది మగాళ్ళకి మండొచ్చేమో..ఏం పర్లేదు.. మండించుకుని, అదే మంటతో కాస్త ఈ ఆడపిల్లల బాధ కి ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించండి..
గుళ్ళు గోపురాలకి విరాళాలిస్తే పుణ్యం వస్తుంది అనుకుంటే, ఆడవారి మానమర్యాదలు కాపాడేలా ఏదైనా చేయగలిగితే అంతకుమించి పుణ్యం-పురుషార్థం దక్కొచ్చు..

ఆడవాళ్ళ పరువు కాపాడడానికి మించిన మగతనం ఉండదేమో!!..నాకైతే ఈ షార్ట్ ఫిల్మ్ చూసి బాధేసింది..సిగ్గేసింది.. ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో అని ఎదురుచూపులు మానేసి, ముందు మనమేం చెయ్యగలమో ఆలోచించి ముందడుగేద్దాం..

ఇలాంటి సున్నితమైన సమస్యపై షార్ట్ ఫిల్మ్ చేసిన టీమ్ కి నా కృతజ్ఞతలు..ధన్యవాదాలు!

సేకరణ : లక్ష్మీ భూపాల 🤔

Post a Comment

Copyright © తాజా వార్త.
Designed by OddThemes &