Top Menu

నీతి వాక్యాలు - మంచి మాటలు - 1 వ భాగం


1. ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా.

2. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం.

3. మరణించిన సింహం కన్నా, బతికున్న కుక్క మేలు.

4. స్వయం సమృద్ది సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం.

5. జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.

6. ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ స్నేహితులూ ఎవరూ మిగలరు.

7. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్దమైపోదు.

8. గెలవాలన్న తపన బలీయంగా ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టలేదు.

9. నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు. బాట వెయ్యడం. త్రోవ చూపడం.

10. ఓటమి గురువులాంటిది. ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది.

11. మనసులో మాలిన్యం ఉన్నపుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం.. చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా.

12. సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది.

13. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.

14. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ’ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయ్యడం లేదు’ అని చెప్పే వ్యక్తి.. అమ్మ

15. నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే, ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది.

16. డబ్బు కాదు.. డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు.

17. కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి.

18. దుష్టులకు దూరంగా ఉండాలి. కానీ వారితో విరోధంగా ఉండకూడదు.

19. ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషీ వెనక్కు వెళ్ళాల్సిందే.

20. ఇప్పటివరకూ వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే.. గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖీ మాట్లాడటం.

21. ఒక గమ్యమంటూ లేనివారికి ఏ లాంతరూ దారి చూపలేదు.

22. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు.

23. ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కన్పించకపోవచ్చు కానీ వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది.

24. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరయినట్లే.

25. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి.

26. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు. తిట్టుకోనవసరం లేదు. నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి.

27. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనకా కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం.

28. పొరుగింటి గోడలు శుభ్రంగాలేవని విమర్శించడం కాదు. నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో.

29. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.

30. రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస. మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని.

31. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్లు, ఆపై ఇనుప గొలుసులు.

32. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు.

33. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం. తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం. -అబ్రహాం లింకన్.

34. చెప్పుల్లేని కాళ్లతో నడిచేవారు దారిలో ముళ్లచెట్లు నాటకూడదు.

35. కష్టాలను జయించడానికి నిస్పృకన్నా చిరునవ్వు బలమైన ఆయుధం.

36. ప్రకృతి, కాలం, సహనం.. ఈ మూడూ మాన్పలేని గాయం లేదు.

37. అనంతమైన ద:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది.

38. నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు.

39. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు. కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది.

40. సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది.

41. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం.

41. నిన్ను చూసి నవ్వే ప్రపంచాలన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం.

42. విజయం, బద్దకం.. రైలు పట్టాల్లాంటివి. ఎన్నటికీ కలవవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండోదానితో వైరం పూనాల్సిందే.

43. పర్వతం ఎత్తు చూసి జంకితే.. శాశ్వితంగా కిందనే.. సాహసించి ఒక్కో అడుగూ పైకి నడిస్తే.. శిఖరాగ్రం మీదనే.

44. హింసకు హింస సమాధానం కాదు.. కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గడ్డివారే మిగులుతారు.

45. దుష్టుల ఆప్యాయత పగకన్నా ప్రమాదం.

46. అన్ని వేళ్లా సింహలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడూ నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి.

47. అన్నింటికీ దేవుడే ఆధారమట్లు ప్రార్థించు మొత్తం నీమీదనే ఆధారపడినట్లు పనిచెయ్యి.

48. నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడూ పడుకుని ఉంటే నీ చాపే నిన్ను ఏవగించుకుంటుంది.

49. ఆచరణలేని ఆలోచన, ఆలోచనలేని ఆచరణ.. రెండూ ఓటమికి రహదారులే.

50. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం.

51. బద్దకస్తునికి ఇష్టమైన పదం ‘రేపు’

52. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైనదాని కంటే తక్కువ తీసుకోవడం గౌరవం.

53. తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడంవల్ల వస్తుంది.

54. సమస్త విజయాలకూ సహనమే సాధనం. గుడ్డును సాగదీస్తే పిల్లను పొందగలం కానీ పగులగొట్టి కాదు.

55. ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ నీకన్నా అందంగా ఉండరు.

56. నిన్ను చూసి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు.

57. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు. అలానే, ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు.

58. చేయవలసిన పనిని చేయకపోవడం, చేయకూడని పనిని చేయడం.. రెండూ తప్పే.

59. కుక్క మొరుగుతోందని సింహం వెనుదిరిగి చూడదు.

60. సాకులు చెప్పడం నేర్చినవాడు ఇంకేమీ నేర్చుకోలేడు.

61. ఎప్పుడూ కింద పడకపోవడం కాదు. పడిన ప్రతిసారీ తిరిగిలేవడమే గొప్ప.

62. మంచివాళ్ళతో స్నేహం చెయ్యి. నిన్నూ వాళ్లలోనే లెక్కిస్తారు.

63. ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటె నువ్వు మెరిగ్గా ఉండటానికి ప్రయత్నించు.

64. ఈరోజు చెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే పని చేసి ఉంటారు.

65. తన పొరపాట్ల నుంచే కాదు, ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం.

66. తెలివిలేని నిజాయితీ, బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి.. భయానకం, ప్రమాదకరం.

67. వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా విధానమే మూలం.

68. సమాధానం చెప్పకపోవడం కూడా ఒక సమాధానమే.

69. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు.

70. మురికినీళ్లయినా సరే మంటలను ఆర్పగలవు.

71. ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి ఉన్నత పదవులు పొందిన వారివల్ల అందరికీ ఇక్కట్లే. స్వశక్తితో పైకొచ్చినవారికీ అల్ప బుద్ది ఉండదు. సూర్యుని వేడిని భరించగలం కానీ ఎండకు వేడెక్కిన బండరాళ్లమీద నడవలేం కదా.

72. తనకు ఏ విధంగానూ సహాయపడలేనివారిపట్లా, తనేం చేసినా ఎదిరించలేనివారిపట్లా ఒక మనిషి ప్రవర్తించే విధానమే అతని వ్యక్తిత్వానికి అసలైన కొలమానం.

73. మనం వెతకవలసింది చెప్పేవారి కులగోత్రాలు కాదు, చెప్పినదానిలోని మంచిచెడులు.

74. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది.

75. ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్దరంగానికి పనికిరాదు.

76. ఓడిపోతామేమోన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది.

77. మురికి నీటితో ఉతికిన దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రన శుభ్రం కావు.

78. ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు. ఆ బాగోదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్టే.

79. తెలియనిది అడిగితే బయటపడే అజ్ఘానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం అజ్ఘానమే.

80. తోటివారితో కలసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించమే నాయకత్వం.

81. నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి.

82. ఈరోజు ఒక చిన్న అబద్దం చెబితే, దాన్ని కప్పిపుచ్చుకొవడానికి రేపు మరో పెద్ద అబద్దం చేప్పవలసిరావచ్చు.

83. ప్రయత్నించనిదే ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు.

84. వైఫల్యానికి కష్టాలో ఇబ్బందులో కారణమని సర్దిచెప్పడాన్ని చరిత్ర ఏనాడు ఒప్పుకోదు.

85. ధైర్యమంటే ప్రమాదాన్ని లెక్కచెయ్యకపోవడం కాదు. ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధికమించడం.

86. పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి.

87. మేథాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం.

88. నిజం చెప్పడానికే కాదు, నిజాన్ని ఒప్పుకోవడానికీ ఎంతో ధైర్యం ఉండాలి.

89. అదృష్టం అందరి తలుపూ తట్టవచ్చు. కానీ ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది.

90. ప్రతి చిన్న అవాంతరానికీ సంకల్పాన్ని మార్చుకునేవారు లక్షానికి దూరమవుతారు. అంతరాయాలు కలిగేకొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి.

91. ఒక్క అంగుళం దారిమళ్లినా లక్ష్యానికి మేల మైళ్లు దూరమయ్యే ప్రమాదం ఉంది.

92. ఇరవై ఏళ్లప్పుడు సాహసం, ముఫ్పైలలో శక్తి, నలభైలలో సంపద, యాభైలలో వివేకం లేనివారికి అవి ఎప్పటికీ ఉండవు.

93. విజేత వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు.. కఠిన శ్రమ, అంకితభావం.

94. ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తధ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం.

95. కొన్ని లోపాలు, కొందరికి అసౌకర్యాలు లేకుండా ఏ మార్పూ ఉండదు.. అది మంచికోసం జరిగే మార్పయినా సరే.

96. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డ వాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు.

97. ఎంత అరగదీసినీ గంధపుచెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు.

98. తనను చూసి కుక్క మొరిగినంత మాత్రన నిజాయితీపరుడు నేరస్తుడైపోడు.

99. తప్పుల్ని పదేపదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది.

100. ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి.. కళ్ళకు కమ్మిన మసకలను తొలగిస్తాయి.

101. విజయ శిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో కృషి చేసేవారికి అవి తలవంచుతాయి.

102. నీ మనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో దాన్ని వెతకడం వెర్రితనం.

103. ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్లీ బయటపడుతుంది.

104. నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి, మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్దంగా ఉంటారు.

105. తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగితేది వైఫల్యమే.

106. ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే. కానీ తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయం.

107. స్నేహం చెయ్యడానికి ఒకటికి పదిసార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసివస్తే వందసార్లు అలోచించు.

108. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది.

109. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది.

110. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే రెండుసార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే.

111. ఒక్క తప్పుకూడా చెయ్యని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్కపని కూడా చెయ్యని వ్యక్తిని నేను చూపిస్తాను. -హెచ్.ఎల్. వేలాండ్.

112. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.

113. అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. స్వేచ్ఛను ప్రేమించడమంటే ఇతరుల్ని
ఇష్టపడటం.

114. బండి మందుకు సాగేటప్పుడు చక్రం అడుగుభాగం పైకీ పైభాగం కిందకి రాక మానవు. పీవనయానంలో సుఖదు:ఖాలూ అంతే.

115. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. అలోచనలు కుంటివో, గుడ్డివో అయితేనే సమస్య

116. ఔన్యత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు. వాటిని అదుపులో ఉంచుకోవడం.

117. విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. -డా.బి.ఆర్. అంబేద్కర్.

118. చెయ్యి మనది కాకపోతే పాముని పట్టుకోవడం సులభం

119. మాట్లాడాల్సినచోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సినచోట మాట్లాడటం రెండూ తప్పే.

120. ఎగతాళి చెయ్యడం, వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు.

121. స్నేహాన్ని నటించే మోసగాడికన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువు మేలు.

122. కత్తి చేసే గాయం కన్నా, మాట చేసే గాయం లోతు

123. నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిమైన యోగసాధన

124. స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి.. కోయిల మామిడిపళ్ళను ఇష్టపడితే కాకి వేపపళ్ళను తింటుంది కదా.

125. ఏ ఆయుధాలూ వాటంతట అవి హానికరం కావు. కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి.

126. తప్పు చేసీ సిగ్గుపడనివారిని సంస్కరించడం ఎవరివల్లా కాదు.

127. ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోవడమంటే.. విమర్శ నిన్ను అంత తీవ్రంగానూ బాధపెట్టలదని అర్ధం.

128. చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషీ ఇచ్చుకోవాలి.

129. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన ధైర్యవంతులు

130. అనంతమైన దు:ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది.

131. ముసలితనంమంటే శారీరక శక్తి క్షీణించడం కాదు. మనోబలం సన్నగిల్లడం

132. తప్పు చేశారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూపోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు.

133. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరకపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమయిపోయిందని తెలుసుకో.

134. సోమరులకు అడవిలో కూడా కలప దొరకదు.

135. గడ్డాలు పెంచుకున్నంత మాత్రన జ్ఘానం వస్తుందనుకుంటే, గొర్రెలన్నీ మహీ జ్ఘానులే.

136. మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది.

137. మనం త్వరగా నిద్రలేచినంత మాత్రనా సూర్యుడు ముందుగా ఉదయిచడు.

138. కేలవం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినట్లు ఊహించినంత మాత్రన పంట పండుతుందా.

139. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే.

140. మల్లెలకీ మంచి గంధానికీ ప్రచారం అవసరం.

141. ‘చింత’కు ‘చిత’కూ తేడా సున్నా. చితి నిర్జీవులను కలిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది.

142. నయంకాని వ్యాధికన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్తలకన్నా నింద.. మేలైనవి.

143. విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది.

144. పానకంలో మునిగినా గరిటెకు తీపి తెలియనట్లే జ్ఘానుల మధ్య ఉన్నా మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు.

145. విజయాన్ని ఇచ్చేది సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది నడవడిక

146. విజయం అంటే ఆశించినదాన్ని సాధించడం కాదు. సాధించవలసినదాన్ని ఆశించడం.

147. మరి తియ్యగా (మంచిగా) ఉంటే నిన్ను మింగేస్తారు. మరీ చేదుగా (చెడ్డగా) ఉంటే ఉమ్మేస్తారు.

148. దుర్మార్గునితో స్నేహమూ మంచిది కాదు. విరోధమూ మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే.

148. అమ్మ..ప్రేమకు ప్రతిరూపం. పదిలంగా కాపాడుకో. ఆమోను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడు కానీ ఆ లోటు ఎంత దుర్భరమో తెలీదు.

149. ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు.

150. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది కావాలి.

151. శత్రువులను వదుల్చుకోవాలంటే.. వాళ్లను స్నేహితులుగా చేసుకోవడంకన్నా మంచి మార్గం లేదు.

152. కళ్లు లేనివారికి అద్దం ఉపయోగపడనట్లే ఆలోచనలేనివారికి శాస్త్రం సహాయకారి కాలేదు.

152. సాహసమంటే ఎప్పుడూ రగిలిపోవడమే కాదు. వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్లీ ప్రయత్నించడం కూడా.

153. తన తండ్రి మార్గమే సరైనది ఒక వ్యక్తి తెలుసుకునే నాటికి అతని మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు.

154. గొప్ప మేథస్సు నలిగినదారిలో నడవదు, ఇంతవరకూ ఎవరూ ఆవిష్కరించని దారుల్ని వెతుక్కుంటుంది.

155. వంద మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసే చూపటమే మేలు - కందుకూరి వీరేశలింగం.

156. స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్కప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి - నికోలాయ్ లెనిన్

157. మనిషికి నిజమైన ఆనందం లభించేది అచోనల్లోనే - షేక్స్ స్పియర్

158. ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే, ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు.

159. జీవితంలో అన్నీ కోల్పోయినా, భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. - క్రిష్ణన్ బోలే.

160. నిరక్షరాస్యత మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. దాన్ని మనందరం ఎంత త్వరగా తరిమేస్తే అంత మంచిది.

161. మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి. - బెంజిమెన్ ఫ్రాంక్లిన్

162. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. - బుద్దుడు.

163. చిన్ని పనులు నిర్లక్ష్యంతో చేసేవారు, గొప్ప విజయాల్ని సాధించలేరు - ఐన్ స్టీన్.

164. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు. కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. - శంకరాచార్యులు.

165. ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నింటికంటే హీనమైనది. భర్తృహరి.

166. ఉత్తమ జీవితానికి మార్గం విజానం, ప్రేరణ, ప్రేమ. - బెర్డ్రండ్ రస్మెల్.

167. విద్య, వివేకం, పరిజ్హానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. - జెఎం. క్లార్క్

168. మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో రెండు చుక్కల మలినం కలిసినంత మాత్రన సముద్రమంతా చెడిపోడు. మహాత్మాగాంధీ.

169. నిజమైన స్నేహితుడు మనసు విప్పి మాట్లాడుతాడు. చక్కని సలహా ఇస్తాడు. కష్టాల్లో ఆదుకుంటాడు. - విలియండెన్.

170. పొరపాటు సహజమంటూ ప్రతీసారీ ఉపేక్షిస్తే అది అలవాటుగా మారే ప్రమాదముంటుంది.

171. మీ హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది.కనుక అసూయకు దూరంగా ఉండండి. డి. సివింజ్

172. స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్కప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి. నికోలాయ్ లెనిన్.

173. జీవితం అనే యుద్దంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. -భగత్ సింగ్

174. జీవితంలో భయపడవలసిన, భాదపడవలసిన విషయమేదీ లేదు. దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం - మేరీ క్యూరీ.

175. నేను హింసను ఎవరికీ బోధించను. ఎంత కష్టంలో ఉన్నప్పుడైనా సరే తప్పు చేయకుండా ఎవరి మందు తలదించవద్దు. -మహాత్మగాంధీ

176. ఒక పని కష్టమని మనం దాన్ని చేయడానికి భయపడం. మనం భయపడతాం కనుక ఆ పని కష్టమనిపిస్తుంది.

177. సరైన విద్యా విధానమే సమాజంలోని, దేశంలోని సమస్యలను పరిష్కరించగలదు. రేపటి భారతావనికి వివేకవంతులైన పౌరుల్ని అందించే బాధ్యత ఉపాధ్యాయులదే. - డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.

178. ధైర్యమంటే.. ఓటమిలోనూ గుండెనిబ్బరాన్ని కోల్పోకపోవడమే.

179. హృదయం నిండా పరులపట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. -అబ్రహం లింకన్.

180. తోటివారిలో సాధించాలన్న పట్టుదలనూ సాధించగలమన్న నమ్మకాన్నీ నింపడమే అసలైన నాయకత్వం.

181. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయలో తెలుసుకోవటమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. - డి.ఎస్. గోర్టన్.

182. వంద మాటలు చెప్పేకంటే ఒక్కమంచి పని చేసి చూపటమే మేలు - కందుకూరి వీరేశలింగం.

183. మనం పరుల కోసం చేసేదే శాశ్వతంగా నిలిచిపోతుంది. మన కోసం మనం చేసేది మనతోనే అంతరించి పోతుంది. - గాంధీజీ.

184. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేడు. -గౌతమ బుద్దుడు.

185. పెట్టుబడిదారులు లేకుండా దేశం మనగలుగుతుంది. కానీ, శ్రామికులు లేకుండా ప్రగతి పథంలో నడవలేదు. -గాంధీజీ.

186. శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం -అబ్రహం లింకన్.

187. కంటికి కను్న తీయాల్సిందే అనుకుంటే, ఈ ప్రపంచం అంతా గుడ్డి వాళ్లే మిగులుతారు. - మహాత్మగాంధీ.

188. మనిషిని పట్టి పీడించే అతి పెద్ద వ్యాధి కుష్టు రోగమో, క్షయనో కాదు. తాను ఎవరికీ అక్కర్లేదనే భావనే. - మధర్ థెరిస్సా.

189. అదర్శాల్ని, నీతి నియమాలి్న మరచిపోయినప్పుడే ఓటమి ఎదురవుతుంది. - జవహర్ లాల్ నెహ్రూ

190. మేధావికుండే ప్రధాన లక్షణం జిజ్ఞాస, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి.

191. తక్కువ మాట్లాడేవారే తెలివిగల వారు. -షేక్ స్పియర్.

192. మనసును నియంత్రిస్తే సంతోషం దానంతటదే మన దరి చేరుతుంది. - బుద్దడు.

193. బలప్రయోగం ద్వారా కాక అవగాహనతోనే శాంతిని సాధించగలగం. ఐన్ స్టీన్.

194. విద్య, వివేకం బాలిలోని నీళ్లవంటివి. వాడిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి.

195. అందరూ సలహాలు స్వీకరిస్తారు కానీ విజ్ఘును మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకుంటారు.

196. బలం అనేది శారీరకమైనది కాదు. అది ధృఢ చిత్తం నుంచి వస్తుంది. మహాత్మాగాంధీ.

197. ఒక్కొసారి చిన్న నిర్లక్ష్యమే జీవితాన్ని నాశనం చేస్తుంది. బెంజిమెన్ ఫ్రాంక్లిన్.

198. పొగడ్త మూడు కాళ్ల కుర్చీలాంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదం ఉంది - వాల్ట్ విట్ మన్.

199. ధైర్యంగా కార్యచరణకు ఉపక్రమించే వారికే విజయం లభిస్తుంది. పర్యవసానాల గురించి ఆలోచించేవారికి మిగిలేది అపజయమే. -జవహర్ లాల్ నెహ్రూ.

200. కష్టాలు కోపం నుంచే జనిస్తాయి. అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగానే ఉండాలి. - తిరువళ్లువార్.

201. ప్రగతి సాధించాలంటే శాంతి అత్యవసరం - రాజేంద్ర ప్రసాద్

202. విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం - విలియం హాడ్ లిట్

203. గెలుపు ఓటములను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర సామర్థ్యానిది కాదు. స్వభావానిది.

204. కుటుంబ కోసం త్యాగం చేసేవాడు ఉన్నతుడైతే, దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడువుతాడు. గాంధీజీ

205. స్వాతంత్ర్యం అంటే బానిసత్వం నుంచి విడుదలే కాదు, కుల, సాంఘిక అసమానతలను తొలగించడం, మత వైషమ్యాలను నశింప జేయడం. - సుభాష్ చంద్రబోస్

206. మంచి దేశాన్ని నిర్మించాలంటే, మందు మంచి పౌరుల్ని తయారుచేయాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

207. ఒక మనిషి గురించి మనకు ముందుగా చెప్పేది ఆ మనిషో, ఇతరులో కాదు. అతని వేషధారణే. -షేక్ స్పియర్.

208. ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డు లేని పడవ వంటి వాడు. గాంధీ.

209. సమయాన్ని సద్వినియోగం చేసుకోని మనిషికి అది దొరకనే దొరకదు. -మాల్కం పోర్చెస్

210. ఉత్తములు ఇతరులకి ఉపకారం చేసేటప్పుడు కూడా ఎంతో వినయవిధేయలతో నడుచుకుంటారు. -సి.న్యూమాన్.

211. డబ్బు నష్టపోతే కొంత కొల్పోతాము. వ్యక్తిత్వం కోల్పొతే సర్వస్వం కోల్పొయినట్టే. -స్వామి వివేకానంద.

212.మేథావి అంటే ఎవరో కాదు. ప్రతి విషయాన్ని స్పష్టంగా చూడగలిగినవాడే. -జాన్సన్

213. విజయం ఒక గమ్యం కాదు. గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. -కన్ ఫ్యూషియస్

214. ప్రపంచంలో ఎంతో మంది సలహాలు పుచ్చుకుంటారు. అయితే కొద్ది మంది తెలివైన వారు మాత్రమే వాటిని ఆచరించగలుగుతుంటారు. -సైరస్.

215. ఎదుటివారిని అణగదొక్కడానికి ప్రయత్నించడం ఆత్మహత్యా సదృశ్యం -మహాత్మాగాంధీ.

216. అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది. మదర్ థెరిసా.

217. పుస్తకంలోకి వెళితే ఎన్నడూ ఎరుగని లోకాన్ని దర్శిస్తారు. వినని బోధనలు వింటారు. మంచి పుస్తకాలు ఎవరూ మాట్లాడని రహస్యాలు చెబుతాయి. -డేవిడ్ మెక్కార్డ్

218. అసూయను నిర్మూలించిన వారే నిజమైన విజేతలు. - అనిస్తెన్స్

219. తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి, ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. -మహాత్మాగాంధీ.

220. తన కోపాన్ని జయించిన వాడు ఎంత పెద్ద శత్రువునైనా జయించగలడు. సి. సైకస్.

221. సుఖంగా జీవించాలంటే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టు.

222. ఆఅయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. - అంబేద్కర్

223. సంకల్పం కార్యరూపం దాల్చని నాడు అది నూనెలేని దీపం లాంటిది. కాంతి తక్కువ. మసి మెండు. -సి.ఆర్.రెడ్డి.

224. పేడ దిబ్బపై ప్రకాశించినా సూర్య కిరణాలు మాలిన్యం కానట్టే దృఢ సంకల్పంతో ఉన్న వాడి మనసు ఎవరూ పాడు చేయలేరు. - స్వామి వివేకానంద.

225. ఉత్సాహం లేనిదే గొప్ప పనులు సాధించలేము - ఎమర్సన్

226. అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు. - మహాత్మ గాంధీ.

227. ఆలోచన వెనకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు తోసుకువస్తుంది

228. ఆలోచనలను సంస్కరించుకోలేనివారు పరిస్థితులను సరిదిద్దుకోలేరు

229. గెలుస్తామన్న నమ్మకం లేనివారు ఓడిపోతామేమోనన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పొందుతారు

230. సాధ్యంకాదన్న భావన మనసులో నుంచి తొలగడమే విజయపథంలో తొలి అడుగు

231. నిన్ను బాధించిన హృదయాన్ని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయాన్ని బాధించకు.

232. మనకు బంధువులనిచ్చేది భగవంతుడు. మిత్రులను చేసుకొనేంది మనమే.

234. జీవితం అనే గొప్ప శాస్ర్తం ఎన్నో కొత్త విషయాలు నేర్పుతుంది. -వినోబా భావే

235. అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా.. జ్జానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది. - స్వామి వివేకానంద

236. అన్ని రకాల జ్జనాల్లో అత్యున్నతమైనవి మనిషి తనను తాను తెలుసుకోవడం. - సర్వేపల్లి రాధాకృష్ణ

237. వేల కొద్దీ నీతులు చెప్పేకంటే ఒక్క మంచి పని చేయడం మేలు - గాంధీజీ

238. విజ్జనాన్ని పెంచుకోవాలంటే మంచి పుస్తకాలు చదవాలి - కందుకూరి విరేశలింగం

239. మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి. - రామకృష్ణ పరమహంస

240. ఎదుటి వారిపై ఆసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి. - అబ్రహం లింకన్

241. ఆశ నుంచి విముక్తి పొందితే దుఖం అంతమవుతుంది. - బుద్దుడు

242. ఆశావాది ఆపదలో కూడా అవకాశాన్ని వెతుక్కుంటాడు. - అబ్రహం లింకన్

243. మనశ్పాంతి. కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్క్షుల లక్షణం. గాంధీజీ

244. విద్య మనిషి నుంచి వేరు చేయలేని సంపద.

245. మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది.

246. అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం - స్వామి వివేకానంద

247. కొద్దిపాటి కోరికలు ఉన్నవారే అందరికంటే ధనవంతుడు -సిసిరో.

248. ప్రేమంటే ఇతరులను ప్రేమించడమే కాదు. అన్ని జీవులలోవున్న భగవంతునిని ప్రేమించు. - రామకృష్ణ    పరమహంస.

249. బలమే జీవనం, బలహినతయే మరణం. - స్వామి వివేకానంద .

250. ఎంతటి శత్రువునైనా ప్రేమతో చూడాలి. 

Post a Comment

Copyright © తాజా వార్త.
Designed by OddThemes &